Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
Ambulance Catches Fire | గుజరాత్ (Gujarat)లో ఘోర ప్రమాదం సంభవించింది. అంబులెన్స్ (Ambulance)లో మంటలు చెలరేగాయి.
Ambulance Catches Fire | గుజరాత్ (Gujarat)లో ఘోర ప్రమాదం సంభవించింది. అంబులెన్స్ (Ambulance)లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో నవజాత శిశువు, ఓ వైద్యుడు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని అర్వల్లి (Arvalli) జిల్లాలో గల మోడసా (Modasa) పట్టణ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు అనారోగ్యంతో బాధపడుతుండటంతో చిన్నారిని మోడసాలోని ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో మోడసా-ధన్సురా రహదారిపై అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి (Ambulance Catches Fire). ఆ సమయంలో అంబులెన్స్‌లో శిశువు తండ్రి జిగ్నేష్ మోచి (38), అహ్మదాబాద్‌కు చెందిన వైద్యుడు శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మనత్ (23) ఉన్నారు. ఈ ప్రమాదంలో వారు సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. అంబులెన్స్ డ్రైవర్, మరో ముగ్గురు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారు కాలిన గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి
Delhi Blast | ఆత్మాహుతి దాడిని సమర్థించిన డాక్టర్ ఉమర్ నబీ.. వెలుగులోకి సంచలన వీడియో
Lalu Yadav | ఈ సమస్యను నేను పరిష్కరిస్తా.. కుటుంబంలో విభేదాలపై లాలూ యాదవ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

