Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన సంచలన వీడియో బయటకు వచ్చింది. పేలుడుకు ముందు అతడు సూసైడ్ బాంబింగ్ (Suicide bombing) గురించి మాట్లాడాడు. అందులో అతడు ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ మాట్లాడాడు.
సూసైడ్ బాంబింగ్ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని.. వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా అతడు అభివర్ణించారు. ‘ఆత్మాహుతి బాంబు దాడికి వ్యతిరేకంగా అనేక వాదనలు ఉన్నాయి. మరణంపై ఉన్న సహజ అంచనాలకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రదేశంలో కచ్చితంగా చనిపోతాడని భావించడాన్ని బలిదాన ఆపరేషన్ అంటారు’ అంటూ ఉమర్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది.
Terrorist Umar Nabi’s calm video before #Delhi suicide bomb attack👇🏻
Justifies and calls Suicide Bombing as ‘martyrdom operations’. Says it’s known in #Islam. Looks pretty committed to the cause. #Pakistan #ISI #Terrorism #BREAKING #redfortblast pic.twitter.com/V5rnGYClit— s (@Snehamtweets) November 18, 2025
కాగా, దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోదాలు చేపట్టగా.. ఫరీదాబాద్‌లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. వైద్యుల మాటున పలువురు ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ నెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 15 మంది మరణించారు. ఇక ఈ పేలుడుకు పాల్పడింది ఓ వైద్యుడిగా అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు. ఈ మేరకు అతడితో సంబంధం ఉన్న వ్యక్తులను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఉమర్ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది అని తేలింది. ఉగ్ర దాడుల గురించి అతడు ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని సన్నిహితులు తెలిపారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. అల్ ఫలాహ్ వర్సిటీ సహా 25 చోట్ల ఈడీ సోదాలు
Lalu Yadav | ఈ సమస్యను నేను పరిష్కరిస్తా.. కుటుంబంలో విభేదాలపై లాలూ యాదవ్
Sabarimala | శబరిమలకు పోటెత్తిన భక్తులు