Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు ముఖ్యంగా అల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al Falah University) చుట్టూ తిరుగుతున్నది. అందులో పనిచేస్తున్న పలువురు వైద్యులు ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. దాడి ప్లాన్ వెనుక వారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక అరెస్టైన వైద్యులంతా హర్యానాలోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన వారు కావడంతో.. ఈ కేసు దర్యాప్తు వర్సిటీ చుట్టే తిరుగుతోంది.
ఈ వర్సిటీ ఉగ్రకార్యకలాపాలకు అడ్డా అంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక దర్యాప్తులో భాగంగా అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ నిధులపై అధికారులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ఇవాళ ఉదయం ఢిల్లీ సహా దాదాపు 25 ప్రదేశాల్లో దాడులు చేశారు. ఓఖ్లాలోని అల్ ఫలాహ్ వర్సిటీ ఆఫీస్, యూనివర్సిటీ ట్రస్టీలు, సంబంధిత వ్యక్తులు, వర్సిటీకి సంబంధం ఉన్న సంస్థల్లో సోదాలు చేపట్టారు. విశ్వవిద్యాలయం నిధులపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ ఈ మేరకు సోదాలు చేపట్టింది.
Also Read..
Lalu Yadav | ఈ సమస్యను నేను పరిష్కరిస్తా.. కుటుంబంలో విభేదాలపై లాలూ యాదవ్
Encounter | అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి
Sabarimala | శబరిమలకు పోటెత్తిన భక్తులు