Sabarimala | కేరళ (Kerala)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple)కు భక్తులు (Devotees) పోటెత్తారు. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది.
ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు సాగే దర్శనాల కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. లక్షలాది మంది మండల దీక్షాపరులు ఇరుముడులతో శబరిమల కొండకు వస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లూ చేసింది.
Also Read..
భారతీయులకు ఇరాన్ వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు
మానిటర్ ఐదు నిమిషాలు ఆగినా.. కాగ్నిజెంట్లో ఉద్యోగులపై నిఘా!
బీహార్లో 20న కొత్త ప్రభుత్వం!