పాట్నా: బీహార్లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఈ నెల 20న పాట్నాలో ఉండొచ్చని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. నితీశ్ కుమార్ సోమవారం రాష్ట్ర గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. కొత్త ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవడానికి మంగళవారం సమావేశమవుతారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు.