టెహ్రాన్: వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశిస్తున్న భారతీయుల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీని రద్దు చేస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తాజా ఉత్తర్వులు నవంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని, సాధారణమైన పాస్‌పోర్టులు కలిగిన భారతీయులందరికీ ఇది వర్తిస్తుందని ఇరాన్ తెలిపింది. భారతీయులు ఇటీవల మానవ అక్రమ రవాణాలో బాధితులుగా మారటం వంటి ఘటనల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.