అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ ‘కల్కి-2’ ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఓ సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో సినిమా షూట్లో జాయిన్ అవుతూ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’ సినిమా తాలూకు అప్డేట్ వెలువడింది. ఈ పాన్ ఇండియా వార్ డ్రామాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్రోద్యమ కాలం నాటి ఈ కథలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇందులో ప్రభాస్‌తో పాటు కథానాయిక ఇమాన్వీ, మిథున్ చక్రవర్తి పాల్గొంటున్నారని తెలిసింది.
తాజా షెడ్యూల్ కోసం ఓ అగ్రహారం సెట్‌ని తీర్చిదిద్దారని, అందులోనే కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనుపమ్‌ఖేర్, మిథున్చక్రవర్తి, జయప్రద, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.