న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ల ఏర్పాటులో విదేశీ సంస్థల హవా కొనసాగుతున్నది. గడిచిన ఐదేండ్లలో 101 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో విదేశీ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి. వీటిలో అమెరికాకు చెందిన సంస్థలే అత్యధికంగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కోలియర్స్ తాజాగా వెల్లడించింది.
2020 నుంచి 2025 మధ్యకాలంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పుణెల్లో 280.2 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో డాటా సెంటర్లను నెలకొల్పినట్టు వెల్లడించింది. దీంట్లో విదేశీ సంస్థలు 101 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీలను ప్రారంభించాయి. మొత్తం జీసీసీల్లో విదేశీ కంపెనీల వాటా 36 శాతంగా ఉన్నది.