Elections | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 28 : ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఎన్నికలు అక్టోబర్ 19న హనుమకొండ ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ ఎదురుగా ఉన్న విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఆర్ బుచ్చయ్య, కె నర్సయ్య తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 4న నామినేషన్లు, 5న నామినేషన్ల పరిశీలన, జాబితా ప్రకటన, 7న నామినేషన్లు ఉపసంహరణ, ఉన్న సభ్యుల తుది జాబితా ప్రకటన 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.
సభ్యులైన విశ్రాంత పోలీసు అధికారులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల అధికారులతో సహకరించి, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని వారు సభ్యులను కోరారు.
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం