Onion Tea | ఉల్లిపాయలను మనం రోజువారి ఆహారంలో భాగంగా తింటూనే ఉంటాం. ఉల్లిపాయలను మనం రోజూ కూరల్లో లేదా వివిధ రకాల వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. ఉల్లిపాయలను కొందరు రోజూ పచ్చిగానే తింటుంటారు. అయితే ఉల్లిపాయలు ఘాటుగా ఉంటాయి కనుక కొందరు పచ్చిగా తినేందుకు ఇష్టపడరు. పైగా ఉల్లిపాయలను తింటే నోరు వాసన వస్తుంది. కనుక ఉల్లిపాయలను తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే ఉల్లిపాయలతో టీ తయారు చేసి తాగవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ఉల్లిపాయలను పచ్చిగా తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో, దీంతో టీ తయారు చేసి తాగినా కూడా అలాంటి లాభాలే కలుగుతాయి. పైగా ఘాటుదనం కాస్త తగ్గుతుంది. నోరు కూడా వాసన రాదు. కనుక ఉల్లిపాయల టీని ఎవరైనా సరే తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఉల్లిపాయల టీని పలు సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది గొంతు సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. ఉల్లిపాయల్లో క్వర్సెటిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్ ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దీంతో రోగాల నుంచి త్వరగా బయట పడవచ్చు.
ఉల్లిపాయల్లో ఉండే క్వర్సెటిన్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది కనుక శరీరంలోని తీవ్రమైన వాపులు సైతం తగ్గిపోతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయల టీ సహజసిద్ధమైన ఎక్స్ పెక్టోరెంట్ గా పనిచేస్తుంది. ఇది గొంతు, ఊపిరితిత్తులలో ఉండే కఫాన్ని తొలగిస్తుంది. దీని వల్ల ఛాతి పట్టేయడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రాంకైటిస్ తగ్గుతుంది. ఉల్లిపాయల టీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. ఈ టీ ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
బీపీ ఉన్నవారికి ఉల్లిపాయల టీ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే క్వర్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలు రక్త నాళాలను ప్రశాంతంగా మారుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇక ఉల్లిపాయల టీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు గాను 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 నుంచి 3 కప్పుల నీళ్లు, కొన్ని అల్లం ముక్కలు, 2 టీస్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పాత్రలో నీటిని పోసి అందులో ఉల్లిపాయ, అల్లం ముక్కలు వేసి నీటిని బాగా మరిగించాలి. స్టవ్‌ను సిమ్‌లో పెట్టి నీళ్లను 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించిన తరువాత ఆ నీళ్లను వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలపాలి. దీంతో ఉల్లిపాయల టీ రెడీ అవుతుంది. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి. ఈ టీని రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతున్నా చాలు, అనేక లాభాలు కలుగుతాయి.