ఎల్కతుర్తి, నవంబర్ 8 : కోళ్లను రవాణా చేస్తున్న వాహనాలు బోల్తా పడటం.. ప్రమాదాన్ని పట్టించుకోకుండా దారిన పోయే వాళ్లు అందులో ఉన్న కోళ్ల కోసం ఎగబడిన ఘటనలు చూసుంటాం. ఈ సారి కూడా జనాలు నాటు కోళ్ల కోసం ఎగబడ్డారు. చేతికందిన కాడికి అన్నట్టుగా కొందరు ఒక కోడిని పట్టుకెళ్తే.. మరికొందరేమో రెండు, మూడేంటి ఏకంగా పదులకొద్దీ కోళ్లను కూడా తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు. ఇంతకీ ఎక్కడివీ నాటుకోళ్లనుకుంటున్నారా..?
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 1000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఉదయం వదిలేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట పరుగులు తీశారు. కొందరు ఒకటి, రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా, మరికొందరు దొరికినకాడికి దొరికినట్టు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు.
ఎవరో వ్యక్తులు ఈ కోళ్లకు వైరస్ రావడం వల్ల వదిలేసి వెళ్లారా..? లేక ప్రమాదవశత్తు వాహనంలో తీసుకెళ్తుంటే కింద పడిపోయాయా..? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే పశు వైద్యాధికారిని దీపిక మాత్రం కోళ్లను ల్యాబ్‌కు పంపించామని ప్రజలెవరూ వాటిని తినొద్దని సూచించారు.


రూ.కోట్లతో కొలువులు.. నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ
ఇందిరమ్మ బిల్లుల్లో తిరకాసు.. నగదు చెల్లింపులో మాట మార్చిన సర్కారు
PDSU | పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ