PDSU | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 7: డిసెంబర్ 10,11,12 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీడీఎస్యూ రాష్ర్ట 23వ మహాసభల ఆహ్వాన సంఘం పోస్టర్లు శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద మహాసభల ఆహ్వానం సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాత్యాయని విద్మహే, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ.. 1970వ దశకంలో జార్జిరెడ్డి ప్రేరణతో ఆవిర్భవించిన పీడీఎస్యూ 50 సంవత్సరాలుగా దేశంలో శాస్త్రీయమైన, సమానమైన విద్య విధానం కోసం నిరంతరం అలుపెరగని పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, పూర్వ రాష్ర్ట సహాయ కార్యదర్శి బండి కోటేశ్వర్, మాజీ రాష్ర్ట నాయకులు ఎలకంటి రాజేందర్, సి.పి.ఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఎం.డి.ఫ్రాహాన్, రమణ, సన్నీ, యూనివర్సిటీ నాయకులు రాజేష్, రాంబాబు, వెంకటేష్ పాల్గొన్నారు.