KTR | మూసీ ప్రాజెక్టుపై శాసన సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. మూసీ ప్రాజెక్టుకు ఎన్ని ఫేజులు ఉన్నాయని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా హడావుడిగా ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారని మండిపడ్డారు.
మూసీ నది పునరుజ్జీవం కోసం సమగ్ర సవివర ప్రాజెక్టు నివేదిక రూపొందించారా అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు కోసం రుణం మంజూరైందని గతంతో మంత్రి చెప్పారని తెలిపారు. డీపీఆర్ కూడా సబ్మిట్ చేయలేదని అప్పుడు ఏడీబీ చెప్పిందని పేర్కొన్నారు. రుణం మంజూరు కాలేదని ఈ నెల 11వ తేదీన ఏడీబీ లేఖ ఇచ్చిందన్నారు. డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని గతంతో ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. 18 నెలలు పడుతుందన్న డీపీఆర్ రెండు నెలల్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్టు మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజులు ఉంటాయని కేటీఆర్ అడిగారు. మూసీ ప్రాజెక్టుకు ఎన్ని ఫేజులు ఉన్నాయని ప్రశ్నించారు. రూ.16వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు లక్షన్నర కోట్లు ఎం దుకు అని నిలదీశారు. మూసీ ప్రాజెక్టులో బఫర్ జోన్ ఎంత అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో వేలాది మంది నష్టపోతున్నారని తెలిపారు. మూసీ ప్రాజెక్టుతో రేవంత్ సర్కార్ గృహ మేధ యాగం చేస్తోందని మండిపడ్డారు. బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు కాంట్రాక్టు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా హడావిడిగా ఇళ్లు ఎందుకు కూలుస్తున్నారని అడిగారు.