రామగిరి, ఆగస్టు 8: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్స్తో ఉద్యోగం (కాంట్రాక్ట్ అధ్యాపకులు)లోచేరిన వారి బాగోతం తాజాగా వెలుగుచూసింది. కాంట్రాక్టు లెక్చరర్స్ బాధలు చూసిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ వీరిని రెగ్యులర్ చేశారు. వీరిలో చా లామంది నకిలీ సర్టిఫికెట్స్తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇంటర్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా 35 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నలుగురు అధ్యాపకులు ఉండటం గమనార్హం. నల్లగొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకురాలు, సూర్యాపేట, కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలల మహిళా అధ్యాపకురాళ్లు, సూర్యాపేట జిల్లా నేరడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోబోటనీ అధ్యాపకుడికి నోటీసులు అందినట్టు తెలిసింది. వీరంతా వారంరోజుల్లోగా ఇంటర్మీడియట్ బోర్డుకు పూర్తి ఆధారాలను సమర్పించాలని నోటీసులో పేర్కొనట్టు తెలిసింది.