ఫేక్ ఎన్వోసీలపై ఏసీబీ విచారణ జరిపించాలి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఫైర్ ఎన్వోసీలు తీసుకుని కళాశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఫేక్ ఎన్వోసీలపై ఏసీబీతో విచారణ జరిపించాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైందవి కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు.
- హైందవి విద్యాసంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఫైర్ ఎన్వోసీలు తీసుకుని కళాశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఫేక్ ఎన్వోసీలపై ఏసీబీతో విచారణ జరిపించాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైందవి కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. తాను 2025లో ఫైర్ ఎన్వోసీ సర్టిఫికెట్ తీసుకుని దాంతో బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్‌కు దరఖాస్తు చేసుకున్నానని, అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తాను రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు నిరూపిస్తే చంచల్‌గూ డ జైలుకు పోవడానికైనా సిద్ధమేనని చెప్పారు. అసలు తనపై ఫిర్యాదుచేసే అధికారం హైడ్రాకు ఎక్కడిదని, తాను జీహెచ్ఎంసీ నుంచి 2025లో సర్టిఫికెట్ తీసుకున్నానని, హైడ్రాకు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ నేతను కాబట్టే వేధిస్తున్నారని, ఈ నకిలీ కుంభకోణం వెనక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి వారిపై కేసులు పెట్టాల్సిందిపోయి కళాశాలలను టార్గెట్ చేసి వేధించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

