హనుమకొండ చౌరస్తా, జులై 25: అన్యువల్ మోడల్ డిగ్రీ పరీక్షలను త్వరగా నిర్వహించాలని పీడీఎస్‌యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాచకొండ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ కట్ల రాజేందర్‌ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నిర్వహించిన అన్యువల్ మోడల్ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు ఒకటి లేదా రెండు సబ్జెక్టులతో ఆగి ఉన్నారని, అలాగే కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారని తెలిపారు.
కావున యూనివర్సిటీ ఇప్పుడు ఆ పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రంజిత్ కుమార్ అన్నారు. తద్వారా రాబోయే ప్రభుత్వ నోటిఫికేషన్లలో వారికి పోటీపడే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి వెంటనే ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. కంట్రోలర్‌ను కలిసిన వాళ్లలో పీడీఎస్‌యూ నాయకులు రాజు, రవి, అనుష, తదితరులు ఉన్నారు.