Hanamkonda : ఈనెల 26న హైదరాబాద్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగే విద్యార్థి సదస్సుకు తరలిరావాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర (Sharat Chandra), యూనివర్సిటీ ఇంఛార్జ్ జెట్టి రాజేందర్ (Jetty Rajender) పిలుపునిచ్చారు. బీఆర్ఎస్వీ రాష్ర్ట సదస్సు కరపత్రాలను వారు కేయూ మొదటి గేటు వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర, జెట్టి మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యారంగం కుంటుపడిందని, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
శనివారం జరుగబోయే సదస్సులో విద్యారంగ సమస్యలను చర్చిండం జరుగుతుందని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్పును విజయంతం చేయాలని కోరారు శరత్, రాజేందర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పాలమాకుల కొమురయ్య, కలకోట్ల సుమన్, కోఆర్డినేటర్లు అరూరి రంజిత్, లంక రాజగోపాల్, యూనివర్సిటీ నాయకులు కందికొండ తిరుపతి, కొనుకటి ప్రశాంత్, పస్తం అనిల్, సునీల్, విజయ్, రమేష్, అనిల్, రాజు పాల్గొన్నారు.