Unity Run | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్లబ్ ఆధ్వర్యంలో ‘యూనిటీ రన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారత ఐక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని గుర్తుచేస్తూ యూనిటీ రన్ చేపట్టారు. విద్యార్థులు, అధ్యాపకులు ఐక్యత, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేస్తూ సమాహారమయ్యారు.
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి యూనిటీ ప్రతిజ్ఞతో ప్రారంభించారు. 120 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా యూనిటీ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఐక్యతా బంధాన్ని బలోపేతం చేయడం, శారీరక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, జాతీయ గర్వభావాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
Actress | భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి.. కంటతడి పెట్టిస్తున్న నుపుర్ అలంకార్ కథ
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మరో ట్విస్ట్ .. శ్రీజ ఎలిమినేషన్, కొత్త కెప్టెన్గా దివ్య!
NTR | గాయాల నుండి పూర్తిగా కోలుకున్నఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ భారీ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..!