NTR | ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది. ‘వార్ 2’ తర్వాత అభిమానులను నిరాశపరిచిన ఎన్టీఆర్, ఈసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. భారీ బడ్జెట్, టెక్నికల్ స్టాండర్డ్స్, విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఒక యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆయనకు మూడు నెలలపాటు విశ్రాంతి అవసరమని అధికారికంగా టీమ్ ప్రకటించింది. దీంతో డ్రాగన్ షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్నారని, మళ్లీ ఫిట్‌గా మారారని టీమ్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మధ్య స్క్రిప్ట్ విషయంలో విబేధాలు ఉన్నాయన్న రూమర్స్ టాలీవుడ్లో వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం స్క్రిప్ట్‌లో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశారని, ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను నవంబర్ మూడో వారం నుంచి తిరిగి ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
ఈ సారి షూటింగ్ షెడ్యూల్ యూరప్‌లో భారీ స్థాయిలో జరగనుందని సమాచారం. కీలక యాక్షన్ సన్నివేశాలు, కొన్ని రొమాంటిక్ సీన్స్ అక్కడే చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారా లేదా అన్నదానిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ‘డ్రాగన్’ సినిమా విడుదల తేదీని గతంలో ప్రకటించినట్టే 2026 జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు తాజాగా మరోసారి ధృవీకరించారు. మొత్తంగా, ఎన్టీఆర్ ఆరోగ్యంగా తిరిగి షూటింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్నందుకు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ‘డ్రాగన్’ పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు పెంచుతోంది.