Government Teachers | ట్యూటర్లకు జీతమెక్కువ.. టీచర్లకు తక్కువ!.. సర్కార్‌కు విద్యాకమిషన్ సిఫార్సు
Government Teachers | సహజంగా టీచర్లకు జీతం ఎక్కువగా ఉండటం.. ట్యూటర్లకు తక్కువ ఉండటం మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా టీచర్లకు తక్కువ జీతం.. ట్యూటర్లకు ఎక్కువ జీతం ఇవ్వాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్‌కు సూచించింది.
Government Teachers | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సహజంగా టీచర్లకు జీతం ఎక్కువగా ఉండటం.. ట్యూటర్లకు తక్కువ ఉండటం మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా టీచర్లకు తక్కువ జీతం.. ట్యూటర్లకు ఎక్కువ జీతం ఇవ్వాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్‌కు సూచించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో(టీపీఎస్) ప్రీ స్కూల్ టీచర్లకు నెలకు రూ. 16వేల వేతనం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇదే బడుల్లో పనిచేసే స్పెషల్ టీచర్లకు మాత్రం నెలకు రూ. 20 వేల వేతనం ఇవ్వాలని సూచించింది.
టీపీఎస్ బడులపై డ్రాఫ్ట్ బిల్లును కమిషన్ సర్కార్‌కు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలిస్తే అనేక వింతలు, విశేషాలు వెలుగుచూస్తున్నాయి. ఇదే స్కూళ్లల్లో పనిచేసే హెచ్ఆర్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ అసిస్టెంట్, స్టూడెంట్ రిలేషన్స్ అసిస్టెంట్, ట్రాన్స్‌ఫోర్ట్ సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, నర్సు, హెడ్కుక్లకు నెలకు రూ. 20వేల వేతన ఇవ్వాలని కమిషన్ సూచించింది. బోధనేతర సిబ్బందికి నెలకు రూ. 20వేలు.. అత్యంత కీలకమైన పునాది వంటి పూర్వప్రాథమిక విద్యను బోధించే టీచర్లకు నెలకు రూ.16వేల వేతనం ఇవ్వాలని కమిషన్ సూచించడం విమర్శలకు తావిస్తున్నది. టీచర్లను లక్ష్యంగా చేసుకోవడం, టీచర్ల గౌరవాన్ని తగ్గించే చర్యలపై టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి.
వేతనాల్లో నాన్ టీచింగ్కే 52 లక్షలు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణకు రూ. 1.57 కోట్ల వ్యయం కానున్నది. దీంట్లో నాన్ టీచింగ్ స్టాఫ్ వేతనాలు రూ.52లక్షలు కాగా, ప్రీ ప్రైమరీ, ఎక్స్ట్రా కరిక్యులర్/సహ పాఠ్యప్రణాళికలు బోధించే టీచర్ల వేతనాలు రూ.39 లక్షలు మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్‌కు నెలకు రూ. 60లక్షలు ఖర్చవుతుందని విద్యాకమిషన్ అంచనావేసింది. మొత్తానికి రెగ్యులర్ టీచర్ల వేతనం అదనం. రెగ్యులర్ టీచర్లు ఉండగా, 18 రకాల సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని కమిషన్ సూచించింది. ఒక సైకాలజిస్ట్, ప్రతి 200 మందికి ఒక కిచెన్ హెల్పర్, కుక్, ఒక నర్సు, నలుగురు అటెండర్లు, ఆరుగురు సెక్యూరిటీ గార్డులు, ప్రతి 150 మందికి ఒకరు చొప్పున శానిటైజేషన్ వర్కర్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల చొప్పున 16 నుంచి 25 మంది సిబ్బందిని నియమించాలని కమిషన్ సూచించింది.
మండలానికి ఒకటా.. రెండా..?
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను మండలం యూనిట్‌గా ప్రారంభించాలని కమిషన్ సూచించింది. అయితే మండలానికి ఒకటా..? రెండా..? అన్న సందేహాలు వస్తున్నాయి. వీటిని మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది. అయితే విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మండలానికి రెండు స్కూళ్లు మంజూరుచేసినట్టు ప్రకటించారు. ఇవి కూడా అన్ని మండలాల్లో కాదని, నియోజకవర్గంలోని ఒక మండలం మాత్రమేనన్న వాదనలు ఉన్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేవి కావని, ఇప్పటికే ఉన్న బడులను టీపీఎస్‌లుగా మారుస్తామని విద్యాకమిషన్ వర్గాలు అంటున్నాయి.
టీచర్ల వేతనాలపై కమిషన్ వైఖరి గర్హనీయం
టీచర్ల వేతనాలపై విద్యాకమిషన్ వైఖరి గర్హనీయం. కమిషన్ తీరును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కమిషన్ ఇచ్చిన నివేదికలో అనేక లోపాలున్నాయి. టీచర్ల కృషిని తక్కువ చేసే ప్రయత్నంపై విచారం వ్యక్తంచేస్తున్నాం. టీచర్ పదోన్నతులు సీనియార్టీకి బదులు పారామీటర్లు/ప్రమాణాలు నిర్ధేశించడం అర్ధరహితం. ఇది సర్వీస్ రూల్స్‌కు పూర్తి వ్యతిరేకం. అవగాహన రాహిత్యంగా మేం భావిస్తున్నాం. 50% హెచ్ఎం పోస్టులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీచేయాలనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తహసీల్దార్, ప్రిన్సిపాల్/హెచ్ఎం, సీఐ వంటి పోస్టులు అనుభవం ఆధారంగా పదోన్నతి కల్పించే పోస్టులు. వీటిని నేరుగా రిక్రూట్చేస్తే ఇబ్బందులు వస్తాయి. టీచర్ల అర్హతల నిర్ణయాధికారం ఎన్సీటీఈకే ఉంది. జాతీయంగా ఒకే విధానం అమలవుతుంది. దీన్ని ఎలా మారుస్తారు. ఇలాంటి కమిషన్ సిఫార్సులను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం.
– పుల్గం దామోదర్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
మరికొన్ని సిఫార్సులు
- ఇంత వరకు రాష్ట్రం, జిల్లా స్థాయిలో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు/డీసీఈబీలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం జిల్లా స్థాయి ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలి.
- పాఠశాల స్థాయిలోనూ పరీక్షల విభాగాన్ని ఏర్పాటుచేయాలి. 1 నుంచి 12వ తరగతి వరకు పరీక్షలను ఎగ్జామినేషన్ బ్రాంచ్ నిర్వహించాలి.
- పాఠశాలల వేళలు భిన్నంగా ప్రతిపాదించారు. సాధారణ విద్యార్థులకు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు తరగతులు ఉంటాయి. ఎంపిక చేసిన వారి కోసం సాయంత్రం 5:15 గంటల వరకు నడుపుతారు.
- ఇక సీనియర్ విద్యార్థులు, ఆటల
పోటీల్లో పాల్గొనేందుకు రాత్రి 8:30 వరకు బడులు నడుస్తాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాత్రి 8:30 గంటల వరకు ఉండాలి. - 10,11,12వ తరగతుల్లోని విద్యార్థుల అసెస్మెంట్ టెస్ట్‌ల కోసం విద్యార్థులను జంబ్లింగ్ చేస్తారు. అంటే ఒక స్కూళ్లో ఉన్న విద్యార్థులకు మరో స్కూళ్లో టెస్ట్ పెడతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

