Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్లో భావోద్వేగాలతో పాటు హౌస్‌లో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. 54వ రోజు జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇదే సమయంలో హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం భరణికి హౌస్‌లో పర్మనెంట్ కంటెస్టెంట్‌గా కొనసాగే అవకాశం లభించింది. దీంతో శ్రీజ మరోసారి బయటకు వెళ్లగా, ఇంటి సభ్యులు ఆమెకు ఎమోషనల్‌గా సెండాఫ్ ఇచ్చారు. ముఖ్యంగా కళ్యాణ్.. శ్రీజ వెళ్లిపోతుండడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
శ్రీజ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్.. భరణికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించారు. అది కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేయడం. ఈ క్రమంలో భరణి తనతో పాటు సాయి, తనూజ, దివ్య, నిఖిల్‌లని కెప్టెన్సీ రేసులో నిలిపాడు. బిగ్ బాస్ “డీజే కెప్టెన్” అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కంటెండర్లు ఒక్కొక్కరుగా స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేయాలి. ఆ కంటెండర్కు సపోర్ట్ చేయాలనుకునే సభ్యులు మరో స్టేజ్‌పై డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎంతమంది సపోర్ట్‌గా ఉన్నారో ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఈ టాస్క్‌లో తనూజకు 8 మంది సభ్యులు సపోర్ట్ చేయగా, ఆమె తర్వాతి స్థానంలో దివ్య నిలిచింది. భరణి తన టర్న్ రాకముందు మాధురిని బతిమాలుతూ “నాకు సపోర్ట్ చేయడంలో నీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మన మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా?” అని అడిగాడు. చివరికి మాధురి భరణి కోసం డ్యాన్స్ చేసి సపోర్ట్ చేసింది.
టాప్ 2లో తనూజ, దివ్య నిలవగా, ఫైనల్ రౌండ్లో బిగ్ బాస్ నిర్ణయ ప్రకారం దివ్య కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యారు. తనూజ కంటే ఎక్కువమంది సభ్యులు దివ్యకు మద్దతు ఇవ్వడంతో ఆమె విజయం సాధించింది. భరణి మాత్రం తనూజ, దివ్య ఇద్దరికీ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉన్నాడు, ఎందుకంటే ఇద్దరితోనూ అతనికి మంచి బాండింగ్ ఉంది. కెప్టెన్సీ అవకాశం చేజారడంతో తనూజ వెక్కి వెక్కి ఏడ్చింది. భరణి సపోర్ట్ చేయకపోవడంపై తీవ్రంగా బాధపడింది. తాను హౌస్‌లో ఒంటరిదాన్ని, ఎవరూ సపోర్ట్ చేయడంలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే సమయంలో మాధురి కూడా “తనూజ కోసం గతంలో లబ్ది పొందిన వాళ్లు కూడా ఈసారి ఆమెకు సపోర్ట్ చేయలేదు” అని వ్యాఖ్యానించింది. ఇలా ఒకవైపు శ్రీజ ఎలిమినేషన్, మరోవైపు దివ్య కెప్టెన్సీతో హౌస్‌లో కొత్త డైనమిక్స్ రూపుదిద్దుకున్నాయి. ఇక రాబోయే ఎపిసోడ్లలో ఈ మార్పులు గేమ్‌పై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.