NIT | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 27 : ఉన్నత విద్యకు అవకాశాల గురించి పాఠశాల పిల్లలను ప్రేరేపించడం, మార్గనిర్దేశం చేయడం కోసం వరంగల్ నిట్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత్ భారత్ అభియాన్ (యూబీఏ) పథకం కింద వికసిత్ భారత్ అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా సేవా పర్వ్ 2025ను సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఈ విషయంలో ప్రాంతీయ సమన్వయ సంస్థగా, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉన్నత్ భారత్ అభియాన్ పథకం కింద శనివారం హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం, దత్తత తీసుకున్న శంబునిపల్లి గ్రామంలో డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగం గురించి సీనియర్ సిటిజన్లలో అవగాహన కల్పించారు.
వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామస్తులకు సమాచారాన్ని వ్యాప్తిచేశారు. నిట్ యూబీఏ చైర్పర్సన్ ప్రొఫెసర్ సరెల్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ ఎం హీరాలాల్, ప్రొఫెసర్ కోలా ఆనంద్ కిషోర్ పాల్గొని విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, శంభునిపల్లి గ్రామం నుండి పెద్దసంఖ్యలో ప్రజలు, పాఠశాల పిల్లలు, గ్రామ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి సహస్రరెడ్డి, శివ పాల్గొన్నారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి