కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 26 : లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తూ అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే కొత్త డిమాండ్‌ను ఇతర కులస్తులు చేస్తున్నారని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గూగులోతు రాజేశ్ నాయక్ అన్నారు. శుక్రవారం పోస్ట్ అఫీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 28న ఆదివారం మహబూబాబాద్ జిల్లాలో లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ సభకు లంబాడీలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ బద్ధంగా ఆర్టికల్ 342 క్లాజ్ 1 ప్రకారం లంబాడీలు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎస్టీ కమిషన్, పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదం పొంది 1976లో భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ గెజిట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర లంబాడీలు రాజ మార్గంలో ఎస్టీలుగా తేల్చబడ్డారని వివరించారు.
స్వతంత్ర భారతదేశంలో 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు అందక తీవ్రంగా నష్టపోయారని నేటికి విద్య, ఉద్యోగ, రాజకీయ వాటాల్లో గిరిజన జనాభాలో 70 శాతం ఉన్న లంబాడీలు తీవ్ర అన్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొంతమంది లంబాడీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెరవెనుక కుట్రలు చేస్తున్న వారికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గిరిజన చట్టాలైన 1/70, పెస, 5th షెడ్యూల్ ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీ జీ టీ టీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, న్యాయవాది, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్, జుంకిలాల్, గోబ్రియా నాయక్, లాలు నాయక్, టీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, హరియ నాయక్, దేవిలాల్ నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హథీరాం నాయక్, మోహన్ నాయక్, గాంధీ నాయక్, బోడ కృష్ణ నాయక్, బాలు నాయక్, టీజీటీటీఎఫ్ నాయకులు రమేష్ బాబు, బిచ్చ నాయక్, మోహన్ నాయక్, వీరన్న నాయక్, ఉపేందర్ నాయక్, సురేష్ నాయక్, కుషాల్ నాయక్, మదన్ సింగ్ నాయక్, హుస్సేన్ నాయక్, పూర్ణచంద్ర నాయక్, రాము, రవి పాల్గొన్నారు.
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్