Montha Cyclone | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 29 : తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ చాలా ప్రాంతాలపై ప్రభావం చూపిస్తోంది. ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావం 18 లక్షల మందిపై ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మొంథా ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు జోరందుకున్నాయి.
మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండలో రోడ్లన్నీ జలమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది. చిన్నారులు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ల మధ్య చిక్కుకున్న చిన్నారులను గమనించిన డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్ నాయక్ వారిని రక్షించి సురక్షితంగా చేర్చారు.
జనగామ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 79819 75495 నంబర్లో సంప్రదించాలని.. ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల ధాటికి వరంగల్ రైల్వే స్టేషన్ ట్రాక్ ఏరియా జలదిగ్బంధమైంది.

రోడ్డును ముంచెత్తిన వరద..
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల