ముజాఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల మొహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి తన భార్యతో వీడియో కాల్ లో మాట్లాడుతూనే ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ప్రస్తుతం అన్సారీ రియాద్‌లో పనిచేస్తున్నాడు. అయితే అతను ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. భార్య సానియాతో వీడియో కాల్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అక్టోబర్ 26వ తేదీన జరిగింది. భర్త మృతి గురించి సౌదీ అరేబియాలో ఉన్న బంధువులకు భార్య తెలియజేసింది. వాళ్లు ఇంటికి వెళ్లే సరికి అన్సారీ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అన్సారీ మృతదేహాన్ని అంత్యక్రితయల కోసం ముజాఫర్‌నగర్ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రెండున్నర నెలల క్రితం అన్సారీ ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. రియాద్‌లో ఉన్న భారతీయ ఎంబసీకి విషయాన్ని తెలియజేశారు. ఏ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.