Landslides | మొంథా తుఫాను (Cyclone Montha) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్రోడ్డులో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.
తుఫాను ప్రభావంతో శ్రీశైలం (Srisailam)లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అప్రమత్తమైన పోలీసులు జేసీబీ సాయంతో రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగిస్తున్నారు. మరోవైపు లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Also Read..
Cyclone Montha | ‘మొంథా తుపాను’పై సీఎం వరుస సమీక్షలు.. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశం..!
Pawan Kalyan | మొంథా తుపానుపై పిఠాపురంలో అప్రమత్తత.. గంట గంటకు సమీక్షిస్తున్న పవన్ కల్యాణ్
Cyclone Montha | అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకిన మొంథా.. మరికొద్ది గంటలు తుపాను ప్రభావం..!