Cyclone Montha : అంతర్వేది వద్ద తీరం దాటిన ‘మొంథా తుఫాన్’ (Cyclone Montha) బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండుసార్లు ఆర్టీజీఎస్ నుంచి, రెండుసార్లు టెలీకాన్ఫరెన్స్‌లు జరిపారు ద్వారా గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అంతేకాదు సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని సీఏం పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని సచివాలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు. విరిగిపడిన చెట్లు, స్తంభాలను వెంటనే తొలగించాలని.. విద్యుత్ సరఫరాను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలానే పునరావాస కేంద్రాల్లో కల్పించిన వసతులు, ఏర్పాట్ల గురించి కూడా సీఎం వాకబు చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేశ్, హోం మినిస్టర్ అనిత, నారాయణలు కూడా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఏపీలో మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో చంద్రబాబుకు ఫోన్ చేశారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. తాజా పరిస్థితిని, ప్రభుత్వం చేపట్టిన జాగ్రత్త చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తుపాను తీరాన్ని తాకిందని వాతావరణశాఖ తెలిపింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వచ్చిందని.. మంచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని పేర్కొంది.
మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన.. హఠాత్తుగా వరదలు వచ్చే అవకాశముందిని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం ఈ ఉపద్రవాన్ని ఎదర్కొనేందుకు అన్నిరకాల చర్యలకు సిద్దమైంది. కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు చిత్తూరు, రంపచోడవరంలోనూ మొంథా ప్రభావం భారీగా ఉండనుంది.
🚨ALERT ; The impact of Cyclone 🌀 Montha has begun .
Andhra Pradesh and Odisha are on high alert and the administration in coastal areas have started evacuations in the coastal areas. Fishermen have been asked not to venture out into open seas till the cyclonic storm,… pic.twitter.com/1LPGY5Pslx
— CSE Aspirants (@cse_aspirantss) October 28, 2025