Minority Youth | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలో మైనార్టీల టీజీఎంఎఫ్సీ ఆర్థిక సహాయం కింద ఫకీర్, దూదేకుల, ఇతర దుర్భల ముస్లిం వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన (మహిళలకు మాత్రమే), ‘రేవంత్ అన్నా కా సహారా’ రెండు పథకాల ద్వారా మోపెడ్లు, బైకులు, ఈ-బైకులు పంపిణీ ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రెండు పథకాలను ప్రారంభించినట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గౌస్ హైదర్ తెలిపారు.
ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన జిల్లాల్లో మైనార్టీ మహిళలకు (వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు మొదలైనవారు) మహిళలకు మాత్రమే ఒక్కసారిగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందించడం, ఈ పథకం కింద చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారాలు మొదలైన వాటికి ప్రోత్సాహం, రేవంత్ అన్నా కా సహారా మిస్కీను కే లియోయే కోసం అర్హత కలిగిన మైనార్టీ లబ్ధిదారులకు మోపెడ్లు, బైక్, ఈ-బైక్ రూపంలో ఒకేసారిగా గ్రాంట్ ద్వారా ఆర్థిక సహాయం అర్హత కలిగిన మైనార్టీ అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష విలువగల మోపెడ్, బైక్,ఈ-బైక్ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
హనుమకొండ జిల్లాలో అర్హత, ఆసక్తిగలవారు ఆన్లైన్ పోర్టల్ https//tgobmmsnew.cgg.gov.in ద్వారా తమ దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని, అక్టోబర్ 6 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ముగుస్తాయని తెలిపారు. ఇతర వివరాలకు 9701179328 నెంబర్లో లేదా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Stock Market | పతనమైన స్టాక్ మార్కెట్లు..! కుప్పకూలిన ఐటీ స్టాక్స్..!
Atram Parameshwar | అర్హులందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి : ఆత్రం పరమేశ్వర్