నార్నూర్, సెప్టెంబర్ 22 :పరులందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని రాజ్ గోండు సేవా సమితి మండల అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 18 గ్రామాలకు చెందిన గిరిజనులు, రాజ్ గోండు సేవా సమితి నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతగా ప్రభుత్వం అర్హులకు ఇళ్లను ఇవ్వకుండా వారికి అనుకూలంగా ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. అధికారులు కేటాయించిన ఇండ్ల సర్వే చేపట్టి అర్హులను గుర్తించి న్యాయం చేయాలన్నారు. గ్రామానికి ఒకటి రెండు ఇల్లు కాకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిడం మాల్‌కు పటేల్, బాదిరావు పటేల్, మాన్కు పటేల్, అమృత్ పటేల్, అంబాజీ పటేల్, జాలిం షాప్ పటేల్, జగన్నాథ్ రావు, జాలింషావ్, జంగు, కొద్దు, లక్ష్మణ్, పరశురాం, వసంతరావు తదితరులు ఉన్నారు.