Vijay | దళపతి విజయ్ విడాకుల వివాదం.. వేణు స్వామి పాత వీడియో వైరల్
Vijay | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, ఈ వార్త అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ జీవితంలో ఈ పరిణామం సంచలనంగా మారింది.
Vijay | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, ఈ వార్త అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ జీవితంలో ఈ పరిణామం సంచలనంగా మారింది. చెంగల్పట్టు జిల్లా కోర్టులో సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన భర్తకు ఓ మహిళా సహనటితో సంబంధం ఉందని ఆమె పిటిషన్లో ప్రస్తావించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై విజయ్ గానీ, ఆయన బృందం గానీ అధికారికంగా స్పందించలేదు.
ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ వివాదంలోకి ఎంటర్ కావడం మరో చర్చకు దారి తీసింది. 2025 అక్టోబర్‌లో తాను చేసిన ఒక జ్యోతిష్య ప్రిడిక్షన్ వీడియోను మళ్లీ షేర్ చేస్తూ, సౌత్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ విడాకుల సమస్యను ఎదుర్కొంటారు. అతనికి ఓ స్టార్ హీరోయిన్‌తో ఉన్న సంబంధం బయటపడుతుంది అని అప్పట్లో చెప్పానని పేర్కొన్నారు. అయితే ఆ వీడియోలో ఎక్కడా విజయ్ పేరు లేదా ఇతరుల పేర్లు స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సంగీత తన పిటిషన్లో 2021 ఏప్రిల్‌లో ఈ విషయం తనకు తెలిసిందని, అది తనను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని పేర్కొన్నట్టు సమాచారం. పెళ్లి బంధం తిరిగి సర్దుబాటు కావడం కష్టమైందని, అందుకే విడాకులు కోరుతున్నట్టు చెబుతున్నారు. అలాగే భరణం విషయంపై కూడా ఆమె కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
కేసు పూర్తయ్యే వరకు నీలాంకరైలోని ఇంట్లోనే నివసించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరినట్టు సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో వ్యక్తిగత జీవితం గురించి స్పష్టత రావాలని ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

