Madhusudhana Chary | నిన్న యూసఫ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి తెలిసి కావాలని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూధనాచారి విమర్శించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం (బాలసముద్రం) నుంచి ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసి కూడా సన్మానం పేరిట యూసఫ్‌గూడలో దిగజారుడు మాటలు మాట్లాడారని పేర్కొన్నారు. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గంలోనే యూసఫ్ గూడ ఉన్నందున ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగింది. ఏ సర్వేలు చూసినా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుంది. కాబట్టి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని భారీ సభ ఏర్పాటు చేశారు.
ఎలక్షన్ కమిషన్ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచే విధంగా నిన్నటి కార్యక్రమం జరిగినందున ఎలక్షన్ కమిషన్ ఎంక్వయిరీ చేసి సీఎం మీద చర్యలు తీసుకోవాలి. మేము ఈ రోజు ఇదే అంశంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఈ నెల 30,31, నవంబర్ 4,5 తేదీల్లో సీఎం అధికారికంగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. ప్రచారానికి ముందే సభల్లో మాట్లాడి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారన్నారు. .
హాలీవుడ్ స్థాయి ఎక్కడ.. రేవంత్ రెడ్డి స్థాయి ఎక్కడ..?
నిన్నటి కార్యక్రమంలో సినీ కార్మికుల పిల్లల కోసం నర్సరీ నుండి 12 వ తరగతి వరకు కార్పొరేట్ విద్యను అందిస్తామని అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించారు. మూడు, నాలుగు ఎకరాల స్థలాన్ని స్కూల్ కోసం చూడండి అని ఆదేశించారు. కానీ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అందరికీ తెలుసునన్నారు.
నమ్మించడం , వంచించడం , ద్రోహం చేయడం రేవంత్ రెడ్డి నైజం. హైదరాబాద్‌కు హాలీవుడ్‌ని తీసుకొస్తా అని అన్నారు. హాలీవుడ్ స్థాయి ఎక్కడ.. రేవంత్ రెడ్డి స్థాయి ఎక్కడ..? అని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి యూనివర్సిటీని ఆక్స్‌ఫోర్డ్ & స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ లాగా చేస్తా అని అన్నారు. మాటల మనిషి చేతలు లేవని ఎద్దేవా చేశారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల