KTR | హనుమకొండ, అక్టోబర్ 06: ఓ నిరుపేద విద్యార్థికి నేనున్నానంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఆ విద్యార్థికి మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు రామన్న. హనుమకొండ 4వ డివిజన్ పెద్దమ్మగడ్డకు చెందిన తల్లిదండ్రులు లేని నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థి ఆర్ముళ్ల గణేశ్‌కు కేటీఆర్ ఆర్థికంగా అండగా నిలిచారు.
ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించినప్పటికి ట్యూషన్ పీజు కట్టలేని పరిస్థితి ఉందని, దీంతో వచ్చిన సీటును కోల్పోయే ప్రమాదం ఉందని గణేష్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కేటీఆర్‌ను సాయం కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ద్వారా వివరాలు తెలుసుకొని తక్షణ సాయంగా రూ1.50లక్షలు అందించారు.
అంతేకాదు భవిష్యత్తులో గణేష్ చదువుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్‌కు దాస్యం వినయ్ భాస్కర్ తక్షణ సాయంగా రూ.1.50లక్షలు అందజేశారు.
ఆ ఆత్మహత్యలను అరికట్టిన ఘనత కేసీఆర్‌కే..
ఈ సందర్బంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… ఉద్యమ నేత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యమ సమయంలో ప్రజల కష్టాలకు చలించి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్నదాతలు, నేతన్నలు, సబ్బండ వర్గాల్లో అనేక ఆత్మహత్యలు జరుగగా… ఆ ఆత్మహత్యలను 10 ఏండ్ల పాలనలో అరికట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
పేదలకు విద్య, వైద్యం అందేందుకు 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో కృషి చేయడం జరిగిందని అన్నారు. సాయం అవసరమైన వేలాది మందికి తోడుగా నిలిచిన మనసున్ననేత కేటీఆర్ అని తెలిపారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు, తోబుట్టువును కోల్పోయి అమ్మమ్మ వద్ద పెరిగిన గణేశ్‌కు కేటీఆర్ అండగా నిలిచారన్నారు. ఆర్ముళ్ల గణేష్ ఎంబీబీఎస్ చదువేందుకు అయ్యే పూర్తి ఖర్చును కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ తరుపున అందించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.
తక్షణ సాయంగా ఈ విద్యా సంవత్సరానికి అవసరమయ్యే 1 లక్ష 50వేల రూపాయలను కేటీఆర్ పంపగా.. ఈ రోజు పార్టీ కార్యాలయంలో నేరుగా గణేష్, గ ణేష్ మామ దేవ దాసు సమక్షంలో అందించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే పూర్తి ర్చు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఇస్తారని దాస్యం వివరించారు. ఈ సందర్బంగా గ ణేష్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
గణేష్ ఎంబీబీఎస్ సీటు సాధించిన ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీకి ప్రత్యేకంగా వెళ్లి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేశామని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. గణేష్ కోసం ఆర్థిక సాయం కావాలని ట్విట్టర్ ద్వారా కోరిన బొలెపాక రాజేష్, గణేష్ మామ దేవ దాసు, పాస్టర్ స్వామి దాసు, గణేష్ పరిస్థితిని కేటీఆర్‌కి తెలిసేలా చేసిన దామెర అక్షయ్లను దాస్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కేటీఆర్‌పై నమ్మకంతో ఎక్స్‌లో ట్యాగ్ చేశా : ఆర్ముళ్ల గణేష్
విద్యపట్ల అవగాహన ఉండటం.. ప్రతి ఒక్కరి సమస్యలపై స్పందిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమ్మకంతో ట్యూషన్ ఫీజు కట్టకుంటే వచ్చిన ఎంబీబీఎస్ సీటు పోతుందని ఎక్స్‌లో ట్యాగ్ చేసానని ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆర్ముళ్ల గణేష్ తెలిపారు. నాకు ట్విట్టర్‌కు వెంటనే స్పందించి ధైర్యం ఇచ్చిన కేటీఆర్ సార్‌కు రుణపడి ఉంటాను. కేటీఆర్ ట్విట్‌ను చూసి నేను ఆశ్చర్య పోయాను.
నా చదువుకు పూర్తి బాధ్యత తీసుకుంటానని అనడంపై ఏమి మాట్లాడాలో మాటలు రావడం లేదు. ఆశ్చర్యపోయాను. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కేటీఆర్‌కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అదే విధంగా ఈ రోజు దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పోరేటర్ జోరిక రమేష్, మనోజ్, పోలపల్లి రామ్మూర్తి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గణేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Will take care of Ganesh’s educational needs
My team @KTRoffice will coordinate https://t.co/ij8SalDu61
— KTR (@KTRBRS) October 4, 2025
BJP MP | వరద బాధితులకు సాయం చేస్తుండగా దాడి.. ఎంపీకి తీవ్ర గాయాలు
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Gold Prices | బంగారం పరుగులు.. తులం రూ.1.23 లక్షలు