Gold Prices | ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు (Gold Prices) రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సంపన్నులకే దడ పుట్టించేలా ప్రస్తుతం బంగారం రేట్లు పెరుగుతూపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,420కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,10,700గా ఉంది.
పసిడి ధరలు పెరగడానికి అనేక కరాణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ అధిక టారిఫ్‌లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులకు తోడు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ (US govt shutdown) కూడా ఓ కారణంగా పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సు 3,935 డాలర్లుగా నమోదైంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. దీపావళి నాటికి బంగారం ధర 10 గ్రాములు రూ.1.25 లక్షలకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు వెండి ధర కూడా బంగారంతో పోటీపడి మరీ పెరిగిపోతోంది. కిలో వెండి ధర రూ.లక్షన్నర దాటింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1.54 లక్షలుగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Also Read..
Inflation | ధరాఘాతాన్ని మరువద్దు.. పెట్టుబడులపై ద్రవ్యోల్బణం ప్రభావమెంత?
పెట్టుబడులపై పన్నులు ఇలా.. పెట్టుబడుల హుషారుతోనే..!
Hybrid Funds | హైబ్రిడ్ ఫండ్స్ అంటే తెలుసా?.. మదుపరులకు అధిక రాబడులు నిజమేనా?