హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. రకరకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతాయి. ప్రధానంగా ఈక్విటీ, డెట్ శ్రేణి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకూ వీలుంది. అయితే ఈక్విటీ, డెట్ కలిపి రెండింట్లోనూ పెట్టుబడులు ఆరంభించిన దగ్గర్నుంచి ఈ హైబ్రిడ్ ఫండ్స్ డెట్ ఫండ్స్ కంటే మదుపరులకు అధిక రాబడులను ఇస్తున్నాయి. అంతేగాక ఈక్విటీ ఫండ్స్ కంటే తక్కువ రిస్క్తోకూడి ఉంటున్నాయి.
ఫండ్‌లో అసెట్ తరగతుల కూర్పు ఆధారంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. హైబ్రిడ్ ఫండ్స్‌ను 7 ఉప విభాగాలుగా వర్గీకరించింది.
అగ్రెసివ్: ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 65-80 శాతం, డెట్ సాధనాల్లో 20-35 శాతం పెట్టుబడులుంటాయి.
కన్జర్వేటివ్: ఈక్విటీ, తత్సంబంధిత సాధనాల్లో 10-25 శాతం, డెట్ సాధనాల్లో 75-90 శాతం పెట్టుబడులుంటాయి.
బ్యాలెన్స్: ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 40-60 శాతం, డెట్ సాధనాల్లో 40-60 శాతం పెట్టుబడులుంటాయి.
మల్టీ-అసెట్ అల్లోకేషన్స్: ఒక్కో అసెట్‌లో 10 శాతానికి తగ్గకుండా కనీసం మూడింటిలో పెట్టుబడులుంటాయి.
డైనమిక్ అసెట్ అల్లోకేషన్స్ లేదా బ్యాలెన్స్ అడ్వాంటేజ్: పూర్తిగా ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సాధనాల్లోగానీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులుంటాయి.
ఆర్బిట్రేజ్: ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 65 శాతం పెట్టుబడులుంటాయి. ఆర్బిట్రేజ్ వ్యూహాన్ని అనుసరిస్తాయి.
ఈక్విటీ సేవింగ్స్: ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 65% (ఆర్బిట్రేజ్ సహా), డెట్ సాధనాలు, డెరివేటివ్ల్లో కనీసం 10% పెట్టుబడులుంటాయి. అయితే స్కీం డాక్యుమెంట్లలో కనీస హెడ్జింగ్‌ను పేర్కొనాలి.