హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) మంగళవారం ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) ను పరామర్శించనున్నారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐకి 14 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
జిల్లాకు చెందిన మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఈ విజయాన్ని జీర్ణించుకోలేక మున్సిపల్ పాలకవర్గాన్ని దక్కించుకోవాలనే కుట్రతో ఎన్నికను సాకులతో అడ్డుకుని అరాచకాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను బెదిరించడం , దాడులకు పాల్పడడంతో పోలీసులను, ప్రభుత్వాన్ని నిలదీసిన బాల్కసుమన్‌పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు బంద్ నిర్వహించాయి. జైలులో ఉన్న బాల్క సుమన్‌ను ఇదివరకే మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రులు కొప్పులు ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పరామర్శించారు.