భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 23 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో ఎజోలా కంపెనీ సీఎస్ఆర్ నిధులు రూ.90 లక్షలతో చేపట్టిన ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన , మహిళ స్త్రీ శక్తి భవనం, ఎన్ ఆర్ ఈ జి ఎస్ కింద సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఇందిరమ్మ నూతన ఇండ్ల గృహప్రవేశం, ధోతిగూడెంలో 33/11 కె.వి విద్యుత్ నూతన సబ్ స్టేషన్ కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవం చేశారు. వి.జే సాయి కెమికల్ కంపెనీని ఆయన సందర్శించారు. రసాయన కంపెనీలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం పోచంపల్లిలో జేవి ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 80 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోతిగూడెంలో ప్రభుత్వ పాఠశాలకు కొత్త బిల్డింగ్, మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈ మల్లికార్జున, సుధీర్ కుమార్, ఏడీఈ కమరత్, ట్రాన్స్‌కో ఈఈ కె.శ్రీనివాస్, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎం ఆర్ ఐ గుత్తా వెంకటరెడ్డి, జిల్లా నాయకులు తడక వెంకటేష్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదన్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భారత లవ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొయ్యడ రజని శ్రీనివాస్ గౌడ్, నాయకులు కొట్టం కరుణాకర్ రెడ్డి, కాసుల అంజయ్య, సుర్వి వెంకటేష్, సురపల్లి రాధిక రమేష్, గ్రామ సర్పంచులు గుమ్మి జంగారెడ్డి, యాట జంగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు వార్డ్ మెంబర్లు రావుల లింగస్వామి, అండాలు కుమార్, ఉప సర్పంచులు మురహరి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి