పెట్టుబడులు పెట్టే ముందు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. వస్తూత్పత్తులు, సేవలకు సంబంధించి పెరిగే ధరలే ద్రవ్యోల్బణాన్ని సూచిస్తాయి. కాబట్టి ద్రవ్యోల్బణం రేటు పెరిగినప్పుడు ఆయా వస్తూత్పత్తులు, సేవల ధరలు సైతం పెరిగి ఖర్చులను పెంచేస్తాయి. అలాగే ఇప్పుడు మీ చేతిలో ఉన్న సొమ్ము విలువ ఏటేటా పడిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఈ ఏడాది ద్రవ్యోల్బణం 8 శాతంగా ఉంటే.. వచ్చే ఏడాది దేన్నైనా కొనాలనుకున్నప్పడు దానికి గతంతో పోల్చితే 8 శాతం అధిక ధరను చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఇలా ఇప్పుడు మీ చేతిలో ఉన్న లక్ష రూపాయలు ఏటా 8 శాతం చొప్పున విలువను కోల్పోతూ 8 ఏండ్ల తర్వాత ఎంత? ఉంటుందో చూస్తే..
అన్ని రకాల పెట్టుబడులపై సమగ్ర రీతిలో పరిశోధించాక, మీకు సరిపోయేది ఏదో దాన్ని గుర్తించి జాగ్రత్తగా ఎంచుకోవాలి.
స్వల్పకాలంలోనే పెద్ద మొత్తంలో రాబడులను అందిస్తాయన్న స్కీములను చూసి మోసపోవద్దు.
ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టిన పెట్టుబడులను సమీక్షించుకుంటూ ఉండాలి.
మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా పొందిన ఆదాయంపై పన్నులు ఏవైనా చెల్లించాల్సి వస్తుందా? అన్నది ముందే చూసుకోవాలి.
మీకు అర్థం కాకపోతే ఆ పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది. ఇతరుల సలహాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
వీలైనంత త్వరగా మీ పెట్టుబడులను ప్రారంభిస్తే అధిక లాభం. మదుపు విషయంలో సమయమే సంపదమరి. చిన్న వయసు నుంచే ఇన్వెస్ట్మెంట్స్కు శ్రీకారం చుడితే.. అవి దీర్ఘకాలం కొనసాగి ఎక్కువ రాబడులను అందించగలవు. ఉదాహరణకు మీకు 25 ఏండ్లు వచ్చేసరికి ఏడాదికి లక్షా పదివేల రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించారనుకుందాం. మీకు 58 ఏండ్లు వచ్చేదాకా ఇది కొనసాగితే.. 35 ఏండ్ల వయసులో మీలాగే పెట్టుబడిని ప్రారంభించినవారితో పోల్చితే 200 శాతం అధిక సంపదను చేజిక్కించుకోవచ్చు. ఇద్దరిదీ ఒకే పథకం. ఏటా 10 శాతం రాబడులుంటాయి. కానీ పదేండ్లు ముందు మీరు ఆ పెట్టుబడిని మొదలు పెట్టడం వల్ల 2 రెట్లు ఎక్కువగా సొమ్మును అందుకోవచ్చు. దాన్ని ఇక్కడ గమనించవచ్చు.
దీన్నిబట్టి మీ పెట్టుబడులను భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు తగ్గట్టుగా పెంచుతూపోవాల్సిందే. లేకపోతే ద్రవ్యోల్బణం మీ రాబడులను తినేస్తుంది.