అహ్మదాబాద్: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో ఇండియన్ జట్టును గాయాలు వీడడం లేదు. సూపర్ 8 స్టేజ్‌కి ప్రిపేరవుతున్న దశలో భారత బృందానికి మరో జలక్ తగిలింది. అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కొట్టిన పవర్ఫుల్ షాట్‌కు స్పీడ్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. ప్యాండ్ బాదిన షాట్‌కు బంతి నేరుగా వెళ్లి సిరాజ్ మోకాలికి తగిలింది. దీంతో అతను తీవ్ర ఇబ్బండిపడ్డాడు. నొప్పి తట్టుకోలేకపోయాడు. చాలా అవస్థపడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి టోర్నీకి ముందు గాయపడ్డ హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్‌కు చివరి నిమిషంలో అవకాశం ఇచ్చారు.
గ్రూప్ స్టేజ్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడిన సిరాజ్ .. మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మిగితా మ్యాచుల్లో సిరాజ్‌ను పక్కనపెట్టేసి బుమ్రా, హర్షదీప్లకు అవకాశం ఇచ్చారు. సూపర్ 8 దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ తెలిపారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడనున్నది. వరల్డ్‌కప్‌లో వరుణ్ నిలకడగా వికెట్లు తీస్తున్నట్లు మోర్కల్ చెప్పారు.