EX MLA Rajaiah | ధర్మసాగర్, డిసెంబర్ 10 : తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిట్ట అని, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కూతురుకి ఎంపీ టికెట్ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి నమ్మకద్రోహం చేశాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శలు గుప్పించారు.
బుధవారం ధర్మసాగర్ మండలంలోని తాటికాయల, రాయగూడెం, కాషాగూడెం, క్యాతంపల్లి, జానకిపురం, రాపాకపల్లె, సోమదేవరపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లో కార్నర్ మీటింగ్ సమావేశాల్లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరి ఎన్టీఆర్ను, చంద్రబాబును, తర్వాత కేసీఆర్ను అందరిని నమ్మించి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా లేని కడియం శ్రీహరి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి పనులు చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు, కల్యాణ లక్ష్మికి తులం బంగారం ఇయ్యలేదు.
ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రచారం మాత్రం గొప్పగా చేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!