బీఆర్ఎస్పై నిర్బంధకాండ..!
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఖమ్మంలోని వినోభానగర్ ప్రాంతంలో పేదల ఇండ్లను కూల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తా తా మధుసూదన్ కొందరు ముఖ్యనేతలను వెంట బెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి బయలుదేరారు.
- ‘భూదాన్’ బాధితుల పరామర్శకు వెళ్తున్న నేతల అరెస్ట్
- సినీఫక్కీలో దారి కాచి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బలవంతంగా ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
- స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగిన ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 24 : ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఖమ్మంలోని వినోభానగర్ ప్రాంతంలో పేదల ఇండ్లను కూల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కొందరు ముఖ్యనేతలను వెంట బెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి బయలుదేరారు. పార్టీ కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టగానే గల్లీల్లో మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యలకు తీవ్రంగా మండిపడిన బీఆర్ఎస్ నేతలు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పోలీసులు నిర్బంధించిన వారిలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు, తోట రామారావు, దండా జ్యోతిరెడ్డి, ఎండీ మక్బూల్, కూరాకుల వలరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ మాజీ డిఫ్యూటీ మేయర్ బత్తుల మురళి, మైనారీటీ నేత ఎండీ తాజుద్దీన్, రఘునాథపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు ఉప్పల వెంకటరమణ, కొల్లు పద్మ, షేక్ షకీనా, ఆరెంపుల వీరభద్రం, గొట్టెముక్కుల శ్రీను, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, ముత్యాల అప్పారావు, పోలెపొంగు వెంకట్, ఉస్మాన్, వీరేందర్, పాషా, రఫీ, మాటేటి కిరణ్, న్యాయవాది మేకల సుగుణారావు, మట్టా వెంకటేశ్వరరావు, సతీష్, కృష్ణారావు తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

