Mountain climbing | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 1 : కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్ జయశీల రూపాని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వద్ద ఉన్న ‘అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్’ నిర్వహించిన 10 రోజుల అడ్వెంచర్ క్యాంపు (నవంబర్ 18- 27)లో విజయవంతంగా పాల్గొన్నారు.
ఈ శిక్షణా శిబిరంలో ఆమె నేచురల్ రాక్ క్లైంబింగ్, ఆర్టిఫీషియల్ మౌంటెన్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్ క్లెంబింగ్, మౌంటెన్ రేపెల్లింగ్, రివర్ క్రాసింగ్ తదితర సాహస క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. ఈ విజయంపై విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం జయశీల రూపానిని అభినందించారు.

Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు