Scientists | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 10 : కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి అధ్యక్షతన రెండురోజుల నోబెల్ ప్రైజ్ డే సంబరాలు ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల అకాడమిక్ స్పిరిట్ ఎంతో గొప్పదని, ప్రతి ఆవిష్కరణ, సృజన మానవ అభివృద్ధికి దారితీయాలని, విద్యార్థుల జిజ్ఞాసను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనవచ్చన్నారు.
విద్యార్థుల మేధస్సే పవర్ ఆఫ్ ఐడియాస్కు పునాదని, విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ మాట్లాడుతూ..మొత్తం 11 విభాగాల నుంచి 300పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడానికి విద్యార్థులతోనే కమిటీ వేసి వారే నిర్వహించేలా చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడ్డ ఆయా విభాగాధిపతులకు, ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధనతోనే దేశం పురోగతి సాధిస్తుందని క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపాల్ టీ మనోహర్ అన్నారు.
ఆవిష్కరణలు ప్రమాణాలకనుగుణంగా, మానవ అవసరాలను తీర్చే దిశగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాల నుంచి మొత్తం 60కి పైగా విద్యార్థులకు మెడల్స్, పుస్తకాలు బహుమతులుగా అందజేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ విభాగ డీన్ గాదె సమ్మయ్య, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పూర్వ వీసీ మహమ్మద్ ఇక్బాల్ అలీ, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు నిరంజన్, టి.రాధిక, పలు విభాగాధిపతులు, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!