BC Vidyarthi JAC | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 24 : బీసీలను రాజకీయంగా సమాధి చేయడానికే జీవో 46 అని.. కాంగ్రెస్ పార్టీ ఆ జీవో తీసుకువచ్చిన వెంటనే రద్దు చేయాలని బీసీ విద్యార్థి జేఏసీ రాష్ర్ట కోఆర్డినేటర్, కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటిగేటు వద్ద విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ జీవో ప్రతులను చించివేశారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన మూడు వేల కోట్ల నిధులు రావడానికి ఇంకా నాలుగు నెలల గడువు ఉన్నప్పటికీ కూడా రాష్ర్ట ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికల్లోకి పోవడానికి కారణమేంటో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా కార్పొరేషన్ చైర్మన్‌గా కావడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకులు సహించలేకపోతున్నారని.. అందుకే వారి కుట్రలో భాగంగా ఈ జీవో 46ను తీసుకొచ్చి బీసీల వెన్నువిరుస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని బీసీలు నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకుపోతున్నారని, వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వైఖరిని మార్చుకొని డిసెంబర్ 1 నుంచి జరిగే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరిగేవిధంగా 9వ షెడ్యూల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుపరిచేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపైన అఖిలపక్షంతో ముందుకెళ్లి పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
బీసీలకు ధర్మబద్ధంగా రావాల్సిన 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తే బీసీ సమాజం ఊరుకోబోదని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్తారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు అన్వేష్, గణేష్, రాజశేఖర్, రాజేష్, అనిల్, సాయివరుణ్, శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు.
Rathotsavam | తిరుచానూరులో వైభవంగా రథోత్సవం..శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
Lakshmi Mittal | పన్నుల సెగ.. బ్రిటన్‌కు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై..?
BR Gavai: బెంజ్ కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ గవాయ్..