Farmers Mela | మమ్మల్ని పోనియ్యరట.. ఇదేం మీటింగ్.. రేవంత్ సర్కార్ రైతు మేళాపై రైతన్నల ఫైర్
Farmers Mela | వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా మంగళవారం నుంచి గురువారం వరకు జరుగనున్నది. హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాకు వచ్చిన రైతుల ఆందోళన చర్చనీయాంశంగా మారింది.
Farmers Mela | రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని రైతాంగానికి వివరించేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా వ్యవసాయ శాఖ రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా మంగళవారం నుంచి గురువారం వరకు జరుగనున్నది.
హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాకు వచ్చిన రైతుల ఆందోళన చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మేళా అని తమను పిలిచి ఇక్కడే నిర్బంధించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మినిస్టర్స్, ఆఫీసర్లు పోతుర్రట.. వాళ్లు ఇండ్లండ్ల పంటరట. రైతులకు బర్రె, దుడ్డె ఉంటది,మక్కజొన్నలున్నయి, కల్లాలల్లా వడ్లు ఉన్నయి. మేం పోవద్దా.. మమ్మల్ని పోనియ్యరట. ప్రతీ డ్రైవర్ లైసెన్స్, ఆర్సీ బుక్, బండి తాళపు చెవులు దగ్గర పెట్టుకున్నరట. సాయంత్రం 5 గంటల దాకా ఇయ్యరట. ఇదేం గవర్నమెంట్, ఇదేం మీటింగ్..అంటూ రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు.
సాయంత్రం 5 గంటల వరకు బస్సుల్లో తిరిగి వెళ్లేదిలేదని అధికారులు తెగేసి చెప్పడంతో.. తమకు ఇంటి వద్ద పశువులు ఉంటాయని.. కల్లాలో ధాన్యాన్ని ఆరబోశామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన తమను వెంటనే ఇండ్లకు పంపించాలని డిమాండ్ చేశారు.
రైతు మేళా అని పిలిచి రైతులని నిర్బంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం
హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాలో రైతుల ఆందోళన
సాయంత్రం 5 గంటల వరకు బస్సుల్లో వెళ్లేదిలేదని తెగేసి చెప్పిన అధికారులు
తమ ఇంటి వద్ద పశువులు ఉంటాయని.. కల్లాలో ధాన్యాన్ని ఆరబోశామని రైతుల ఆందోళన… pic.twitter.com/BO0js9fEkp
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026
Read Also :
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

