Sundeep Kishan | టాలెంటెడ్ నటుడు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే కానుకను అందించింది. సందీప్ కెరీర్లో 33వ చిత్రంగా (#SK33) అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న కొత్త ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ‘శంబాల’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదొక సోషియో-ఫాంటసీ, మైథాలజికల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. ‘మౌనంగా జన్మించాడు.. కాలాలను జయించేందుకు సిద్ధమయ్యాడు’ అనే అర్థం వచ్చేలా విడుదల చేసిన ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ పోస్టర్లో సింహం ఒక చిన్నారిని చూస్తూ గంభీరంగా కనిపిస్తుండగా, మధ్యలో ఉన్న కత్తి సినిమా నేపథ్యాన్ని ప్రతిబింబిస్తోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహిధర్ రెడ్డి ఈ పాన్-ఇండియా చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం, ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.
Born in silence.
Destined to conquer timelines ⚔️Wishing the fierce and phenomenal @sundeepkishan a majestic birthday as #SK33 rises into something truly epic.
A warrior’s journey begins. 🌿
A @ugandharmuni fantasy adventure
Produced by #RajasekharAnnabhimoju #MahidharReddy… pic.twitter.com/OxGOkwRLw8
— Ramesh Bala (@rameshlaus) May 7, 2026