Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!
M.S. Raju | ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు ఎం.ఎస్. రాజు (M.S. Raju) నటి వనిత విజయ్ కుమార్ (Vanitha Vijaykumar) ధైర్యం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
M.S. Raju | ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు ఎం.ఎస్. రాజు (M.S. Raju) నటి వనిత విజయ్ కుమార్ (Vanitha Vijaykumar) ధైర్యం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘అగధ’. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయగా.. ఈ టీజర్ ఈవెంట్లో ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ ఆయన నిర్మాణంలో వచ్చిన ‘దేవి’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక భయానక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు.
‘దేవి’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సెట్లో వనిత విజయ్ కుమార్‌ను నిజంగానే ఒక పాము కాటేసింది. ఆ సమయంలో సెట్లో ఉన్న యూనిట్ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణాపాయం ఉంటుందేమోనని అందరూ టెన్షన్ పడుతుంటే, వనిత మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. తనకు ఏమీ కాదని, అమ్మవారే తనను కాపాడుతుందని ఆమె ఎంతో నమ్మకంతో చెప్పినట్లు ఎం.ఎస్. రాజు చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
దేవి సినిమా షూటింగ్లో వనిత విజయ్ కుమార్ ను పాము కాటేసింది
సెట్ లో ఉన్న మేమంతా టెన్షన్ కంగారు పడిపోయాం
వనితా మాత్రం నాకు ఏమీ కాదు అమ్మవారు కాపాడుతుంది అని చెప్పింది
ఆమె బోల్డ్ నెస్ గురించి వివరించాలి అంటే ఈ ఇన్సిడెంట్ సరిపోతుంది : ఎం ఎస్ రాజు#Agadha pic.twitter.com/zJWF9Ujq5U
— Filmy Focus (@FilmyFocus) May 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

