KTR | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పనిచేస్తున్న 26 మంది ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, రూ. 5 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మన కేంద్రకార్యాలయంలో 26 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతోపాటు జిల్లా ఆఫీసుల్లో పనిచేసేవాళ్లకు నెక్ట్స్ ఇద్దాం. మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ ఆలోచన ఇది. మనం ఏం చేద్దాం అని నేను, చంద్రశేఖర్ రెడ్డి ఆలోచిస్తున్నప్పుడు తమ్ముడు సాయి కిరణ్ అక్కడే ఉన్నాడు. అన్నా ఉద్యోగులకు మంచి బట్టలు పెట్టి, ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటదనే ఒక మంచి కార్యక్రమం గురించి చెప్పాడు. నాకు చెప్పడమే కాకుండా ఈ కార్యక్రమానికి మొత్తం సూత్రధారిగా వ్యవహారం చేశాడు. ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పిన సాయి కిరణ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..
తెలంగాణ భవన్లో పనిచేస్తున్న 26 మంది ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, రూ. 5 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/VpODOHQAm7— BRS Party (@BRSparty) August 15, 2026
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..