హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 26: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని రుద్రేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు పాల్గొని రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వేయి స్తంభాల దేవాలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Bihar cabinet | బీహార్ క్యాబినెట్ విస్తరణ.. ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం.. Videos
Watch: టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీస్.. టీటీఈ ఏం చేశాడంటే?
Hyderabad | నువ్వు నాకే కావాలి.. పెళ్లి చేసుకోవాలని వివాహితకు యువకుడి బెదిరింపులు.. వినకపోవడంతో దాడి