హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు. దీంతోపాటు 5 రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా) స్టేట్ టాపర్స్‌గా నిలిచారు.
వివన్ శరత్ మహేశ్వరి, మాధవ్ విరాడియా, నరేంద్రబాబు గారి మహిత్ 100 పర్సంటైల్ సాధించి దేశంలోనే టాపర్లుగా నిలిచారు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన విష్ణుసాయి తేజ 99.999పర్సంటైల్‌తో, గోవాకు చెందిన తనయ్ అజిత్ ప్రభు 99.825 పర్సంటైల్‌తో ఆయా రాష్ర్టాల్లో అగ్రస్థానంలో నిలిచారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలియజేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ మాట్లాడుతూ.. జేఈఈ మెయిన్ పరీక్ష కొరకు నారాయణ అందిస్తున్న అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్‌లు, పటిష్ట ప్రణాళిక, స్టడీ మెటీరియల్, నిబద్ధతతోనే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. విద్యార్థుల కృషిని, తల్లిదండ్రుల సహకారాన్ని, నారాయణ అధ్యాపక బృందం అంకితభావాన్ని వారు కొనియాడారు.