భద్రాచలం, జూలై 30 : భద్రాచలంలో ఇసుక లారీల రాకపోకల కారణంగా ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో యూత్ సభ్యులు పూడ్చి వేశారు. రోడ్డపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో డిపో యూత్ సభ్యులు స్వచ్చందంగా ముందుకు పచ్చి గుంతలను పూచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ.. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. యువత సామాజక బాధ్యతతో ముందుకు పచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుంజా సంతోష్, నాగ, భాసీం, అంబు పాల్గొన్నారు.